close

తాజా వార్తలు

Published : 18/10/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. హయత్‌నగర్‌ కార్పొరేటర్‌పై దాడి

భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదనీరు పోయే దారిలేక, నిత్యావసరాలు దొరక్క అల్లాడుతున్నారు. ఇదే క్రమంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఉప్పల్‌ ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని రంగనాయకులగుట్టలో కార్పొరేటర్‌ తిరుమలరెడ్డిపై స్థానికులు దాడి చేశారు. నాలా భూముల కబ్జాపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చైనా ‘బెదిరింపు దౌత్యం’!

అమెరికాలో చైనా స్కాలర్లపై న్యాయశాఖ జరుపుతున్న విచారణను డ్రాగన్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అందుకు ప్రతీకారంగా చైనాలో ఉన్న అమెరికా పౌరులను బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలుసార్లు అమెరికా ప్రభుత్వానికి చైనా హెచ్చరికలు జారీ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ఈ మేరకు ప్రముఖ పత్రిక ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దేశంలో కొత్తగా 61,871 మందికి కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే క్రియాశీల కేసులతోపాటు, కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. శనివారం 9,70,173 నమూనాలను పరీక్షించగా 61,871 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1033 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,14,031గా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో 1,436 కరోనా కేసులు

4. మరో నాలుగేళ్లు మనమే: ట్రంప్‌

 అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల కరోనా నుంచి కోలుకున్న తర్వాత తన ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో శనివారం మిచిగాన్‌లో ఏర్పాటు చేసి ర్యాలీలో ట్రంప్‌ పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో లాగానే ప్రజలకు ఎల్లప్పుడూ రిపబ్లికన్‌ పార్టీనే గెలిపించాలని ఆకాంక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శీతలీకరించిన ఆహారపదార్థాల ప్యాకేజ్‌తోనూ వైరస్‌!

శీతలీకరించిన ఆహార పదార్థాల ప్యాకేజ్‌ కరోనా వైరస్‌తో కలుషితమైతే.. వాటి నుంచి కూడా కొవిడ్‌‌ సోకే ప్రమాదం ఉందని తాజాగా చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) హెచ్చరించింది. నౌకల్లో దూర ప్రాంతాలకు తరలించే శీతలీకరించిన ఆహారంతోనూ వైరస్‌ వ్యాపిస్తుందని తెలిపిన తొలి ప్రకటన ఇదే కావడం గమనార్హం. ఖింగ్‌డావో నగరంలో ఉన్న నౌకాశ్రయంలోని శీతలీకరణ గిడ్డంగుల్లో పనిచేసే ఇద్దరు కార్మికులకు వైరస్‌ సోకినట్లు సెప్టెంబరులో గుర్తించారు. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. వారి నుంచి మరో 12 మందికి వైరస్‌ సంక్రమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సింహవాహనంపై శ్రీనివాసుడు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం మలయప్ప స్వామి సింహ వాహనంపై విహరించారు. ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చిన సింహ వాహనాన్ని పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో అలంకరించారు.  యోగ నృసింహుడిగా సింహవాహనంపై స్వామి దర్శనమిచ్చారు. అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పప్పూసేన నన్ను మిస్‌ అవుతోంది: కంగన

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార పార్టీని పప్పూసేన అని విమర్శించారు. కంగన ట్విటర్‌ వేదికగా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటారు. అయితే  కంగన, ఆమె సోదరి రంగోలీ సోషల్‌మీడియా వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా పోస్టులు పెడుతున్నారని పేర్కొంటూ ఇటీవల ఓ వ్యక్తి బాంద్రా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. సమగ్ర విచారణ అనంతరం కంగన, రంగోలీపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆమె రోదనలు వినిపించలేదేమో..!

తెలిసిన వ్యక్తే కదా అని అమాయకంగా వెంటవెళ్లిన ఓ దివ్యాంగురాలిపై సమీప బంధువు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. గుజరాత్‌లోని బనాస్కాంతలో పొలాల్లో నిర్జీవంగా పడిఉన్న ఓ 12 ఏళ్ల బధిర (మూగ, చెవుడు) బాలిక మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై అత్యాచారం చేసి, గొంతునులిమి హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బాలిక పసుపురంగు టీషర్ట్‌ ధరించిన ఓ వ్యక్తితో ద్విచక్రవాహనంపై వెళుతూ కనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గవర్నర్‌ అలా అని ఉండాల్సింది కాదు: అమిత్‌ షా

ఆలయాలు తెరిచే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ మధ్య జరిగిన మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. గవర్నర్‌ ఆ పదాల్ని ఉపయోగించకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సీఎన్‌ఎన్‌-న్యూస్‌18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల్ని సడలిస్తూ క్రమంగా సాధారణ కార్యకలాపాల్ని మహారాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధిరిస్తూ వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆఖరి ఓవర్‌పై ధోనీ క్లారిటీ

చెన్నై చేతుల్లో నుంచి మరో మ్యాచ్‌ జారిపోయింది. శనివారం రాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లక్ష్య ఛేదనలో ఉన్న ప్రత్యర్థి జట్టుకు ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి ఉంది. క్రీజులో శిఖర్‌ ధావన్ ఉన్నాడు‌. అతను భారీ సిక్సర్లు కొట్టలేడు. మ్యాచ్‌ గెలిచేయొచ్చు అనుకున్నారంతా. కానీ.. అలా జరగలేదు. మరో ఎండ్‌లో ఉన్న అక్షర్‌ పటేల్‌ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా పోరుకు సిద్ధం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.