close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/01/2020 21:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఛపాక్‌’: యాసిడ్‌ దాడి బాధితులకు ఫించను..!

ముంబయి: ‘ఛపాక్‌’ సినిమా ప్రభావంతో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కొత్త పథకానికి నాంది పలకనున్నారు. యాసిడ్‌ దాడికి గురైన బాధితురాలకు త్వరలో ఫించను అందించనున్నట్లు ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య ప్రకటించారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఛపాక్‌’. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి విజయాన్ని అందుకుంది. దీపిక పదుకొణె కీలకపాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులపై గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది.

ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని యాసిడ్‌ బాధితులకు త్వరలోనే ఫించన్‌ను అందించాలనుకుంటున్నట్లు  మంత్రి తెలిపారు. ‘యాసిడ్‌ దాడి బాధితులు సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రతి ఏడాది రూ.5000-రూ.6000 నగదును ఫించన్‌గా అందించే విధంగా ఓ కొత్త పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేబినేట్‌లో ఈ పథకం ఆమోదం పొందిన వెంటనే దీనిని అమలులోకి తీసుకువస్తాం. దాడికి గురైన ఎందరో ధైర్యవంతులైన మహిళలు.. తమ కలలను సాకారం చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోందని భావిస్తున్నాం.’ అని ఆమె పేర్కొన్నారు.

అనంతరం ఆమె ‘ఛపాక్‌’ సినిమాపై వస్తున్న విభేదాల గురించి స్పందించారు. ‘ఓ అమ్మాయి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈసినిమా తెరకెక్కించారు. కాబట్టి అసలైన ఆ అమ్మాయికే ‘ఛపాక్‌’ సినిమాపై ఎలాంటి సమస్యలు లేనప్పుడు మిగిలిన వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని ఆమె తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.