close

తాజా వార్తలు

పాక్‌ 1971లో చెప్పిన ఓ అబద్ధపు కథ..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మాకు నష్టం వాటిల్లలేదు’.. ఇదీ కన్నీటిని పైగుడ్డతో అదుముకుంటూ పాక్‌ తరచూ చెప్పే అబద్ధం.. దీనికి వంతపాడేందుకు విదేశీ మీడియాలో ఒక వర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.. ఈ అబద్ధాలను వినడం భారత్‌కు ఇదేం కొత్తకాదు. 1971లో యద్ధ సమయంలో కూడా పాక్‌ ఇలాంటి ‘గఫూర్‌’కథలనే అద్భుతంగా అప్పట్లోనే వండి వార్చింది. 
ఆ యుద్ధం అనంతరం ఏం జరిగిందంటే..?
1971లో భారత్‌ సాయంతో బంగ్లాదేశ్‌ అవిర్భవించింది. భారీ సంఖ్యలో పాక్‌ ఆర్మీ లొంగిపోయింది. కానీ తొలుత పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌, సైన్యం కలిసి భారత వాయుసేనకు వ్యతిరేకంగా ప్రచార యుద్ధానికి తెరతీశాయి. ఈ యుద్ధంలో పాక్‌ మూడు నుంచి నాలుగు అత్యాధునిక మిరాజ్‌-3 యుద్ధవిమానాలను కోల్పోయింది. భారత వాయుసేన వీటిని కూల్చేసింది. కానీ ఈ విషయాన్ని అసలు అంగీకరించలేదు. అప్పుడు కూడా భారత వాయుసేన చీఫ్‌ వచ్చి మా మిరాజ్‌ విమానాలను లెక్కచూసుకోవచ్చు అని దబాయించింది. మరో అడుగు ముందుకేసి ఒక ఎయిర్‌ బేస్‌లో 22 మిరాజ్‌-3లను చేర్చి విదేశీ పాత్రికేయులను పిలిచి లెక్కబెట్టుకోమని చెప్పింది. తమకు మొత్తం 24 మిరాజ్‌ విమానాలు ఫ్రాన్స్‌ నుంచి అందాయని.. వాటిల్లో  ఒకటి యుద్ధానికి ముందే శిక్షణలో కూలిపోగా.. మరొకటి మరమ్మతులకు గురైందని పేర్కొంది. ఇక భారత వాయుసేన మూడు విమానాలను ఎక్కడి నుంచి కూల్చిందని ఎద్దేవా చేసింది. ఇంకేముంది ప్రపంచ మీడియా సంస్థలు భారత్‌కు వ్యతిరేకంగా భారీ ప్రచారానికి తెరతీశాయి. విమానాలు సరఫరా చేసిన ఫ్రాన్స్‌ను అడిగి తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. అప్పట్లో కూడా పాక్‌ భూభాగంలోనే విమానాలు కూలాయి. వాటిల్లోని పైలట్లు కూడా మృతి చెందారు. శకలాలు లేకుండా చేసి ఆధారాలను చూపలేదు. ఫలితంగా భారత వాయు సేన కొంత ఇబ్బంది పడింది. దీంతో పాక్‌ ప్రచారం దాదాపు విజయం సాధించే పరిస్థితికి వచ్చింది. చివరికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి పాక్‌ అబద్ధపు ప్రచారాన్ని చీల్చి చెండాడింది. 1971 యుద్ధానికి ముందు తాము పాక్‌కు 28 మిరాజ్‌ -3 విమానాలను సరఫరా చేశామని పేర్కొంది. ఫ్రాన్స్‌ ప్రకటనతో పాక్‌కు నోటమాట రాలేదు. అంటే నాలుగు విమనాలను ఈ యుద్ధంలో పాక్‌ కోల్పోయిందన్నమాట. ఫ్రాన్స్‌ ప్రకటన తర్వాత కూడా పాక్‌ విమానాలు నష్టపోయినట్లు అంగీకరించలేదు.. అలాగాని లెక్క చూపలేదు. దీంతోపాటు ఈ యుద్ధంలో పాక్‌ జోర్డాన్‌ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకొన్న ఎఫ్‌-104 విమానాన్ని కూడా భారత మిగ్‌-21 కూల్చేసింది. 
ఎఫ్‌16 పై ప్రేమదేనికీ..
‘ఫారిన్‌ పాలసీ’ పత్రికలో శనివారం వచ్చిన ఆధారరహిత కథనంతో ప్రపంచ వ్యాప్తంగా పాక్‌ ఎఫ్‌16 కూలలేదనే ప్రచారం లభించింది. ఆ మర్నాడు పెంటగాన్‌ దీనిని తోసిపుచ్చినా అంతప్రచారం రాలేదు. దీనిలో పాక్‌ తన పరువు మాత్రమే చూసుకొంటోంది. కానీ దీని వెనుక అంతకు మించిన కథ నడుస్తోంది. ఆయుధ మార్కెట్లో వారి ఉత్పత్తులు బలహీనమైనవనే ముద్రపడకుండా చూసేందుకు ఎంతకైనా తెగిస్తాయి. 2015లో ఇలాంటి ఘటనే జరిగింది. అఫ్గనిస్థాన్‌లో ఒక ఎఫ్‌16 యుద్ధవిమానంపై తాలిబన్లు కేవలం ఒక రాకెట్‌ లాంఛర్‌ సాయంతో దాడి చేశారు. ఈ దాడిలో ఆ విమానం బాగా దెబ్బతింది. ఆ తర్వాత ఎగరడానికి అది పనికిరాదని తేల్చేశారు. దీనిపై లాక్‌ హీడ్‌ మార్టిన్‌ తీవ్రంగా స్పందించింది. ఈ నివేదిక బయటకు రాకుండా ఆ సంస్థ తీవ్రంగా ప్రయత్నించింది. ఎఫ్‌-16 తక్కువ స్థాయి విమనాల చేతిలో కూలడం ఇదేం కొత్తకాదు. 1996 అక్టోబర్‌లో కూడా గ్రీక్‌ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన ఎఫ్‌16డీను హెచ్‌ఏఎఫ్‌ మిరాజ్‌2000 విమానం ఆర్‌.550 మ్యాజిక్-2 క్షిపణితో కూల్చేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే నష్టాన్ని ఒప్పుకోవడం అంటే పాక్‌కు విపరీతమైన నామోషీ.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.