ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: నలుగురి మృతి
close

తాజా వార్తలు

Updated : 09/11/2020 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: నలుగురి మృతి

 ఇద్దరికి తీవ్రగాయాలు

జగిత్యాల: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కారు హైదరాబాద్‌ నుంచి మల్లాపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు మల్లాపూర్‌కు చెందిన రమాదేవి, లత, శృతి (2),చరణ్‌ (4నెలలు)గా గుర్తించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని