హైకోర్టు న్యాయవాది కారును ఢీ కొట్టిన లారీ
close

తాజా వార్తలు

Updated : 23/02/2021 11:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైకోర్టు న్యాయవాది కారును ఢీ కొట్టిన లారీ

ఘటనపై న్యాయవాది దుర్గాప్రసాద్‌ అనుమానం..పోలీసులకు ఫిర్యాదు

జనగామ రూరల్‌: జనగామ జిల్లా యశ్వంత్‌పూర్ సమీపంలోని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఓ న్యాయవాది కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్‌ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ జనగామ ఠాణాలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన దుర్గాప్రసాద్‌ ఓ భూ వివాదం కేసును వాదించేందుకు వరంగల్‌ కోర్టుకు తన కారులో బయలుదేరారు. జనగామ మండలం యశ్వంత్‌పూర్‌ వద్దకు రాగానే లారీ వెనుక నుంచి వచ్చి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారును లారీ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అయితే న్యాయవాది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 

తన ప్రాణాలకు హాని కలిగించేందుకు దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు దుర్గాప్రసాద్‌ ఆరోపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనే అలాగే పేర్కొన్నారు. ఘటన అనంతరం స్థానికులు లారీ డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. లారీ బ్రేకులు విఫలం కావడంతోనే ప్రమాదం జరిగినట్లు లారీ డ్రైవర్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని