Oxygen Langarతో ప్రాణాలు నిలుపుతున్నారు!
close

తాజా వార్తలు

Published : 24/04/2021 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen Langarతో ప్రాణాలు నిలుపుతున్నారు!

గురుద్వారా: దేశంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న వేళ ఆస్పత్రులలో ఆక్సిజన్‌ సరఫరా లేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ ఇందిరాపురం గురుద్వారాలో ‘ఆక్సిజన్‌ లాంగర్‌’ను అందుబాటులోకి తెచ్చారు. మహమ్మారి సోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ ఉచితంగా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్న ఎవరికైనా ప్రాణవాయువు అందిస్తామని గురుద్వారా నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణవాయువు దొరకనివారి కోసం ఆక్సిజన్‌ లాంగర్‌ ఏర్పాటు చేశామని.. ఆక్సిజన్‌ పొందేందుకు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు వెల్లడించారు. ప్రాణవాయువు కోసం చాలా మంది వస్తున్నారని, వారందరికీ అందిస్తున్నామని గురుద్వారా అధ్యక్షుడు గుర్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. తమకు రోజూ వందల సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని, మరిన్ని ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం.. మరికొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని