close

తాజా వార్తలు

Published : 04/05/2021 10:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

IPL యూఏఈకి తరలిద్దామన్నా..!

మొగ్గు చూపని బీసీసీఐ

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సజావుగా సాగుతున్న లీగ్‌పై ఒక్కసారిగా కరోనా  రక్కసి కోరలు సాచింది. దాంతో సీజన్‌ మున్ముందు సవ్యంగా సాగుతుందో లేదోనన్న అనుమానాలు నెలకొన్నాయి. కాగా లీగ్‌ను యూఏఈకి తరలించే ప్రతిపాదనను బీసీసీఐ మొదట్లో వ్యతిరేకించిందని సమాచారం.

సీజన్‌ ఆరంభానికి వారం రోజుల ముందుగా లీగ్‌ను యూఏఈకి తరలిద్దామని ఐపీఎల్‌ పాలక మండలి బీసీసీఐకి ప్రతిపాదించిందని అంటున్నారు. నాలుగు ఫ్రాంచైజీలు సైతం ఇందుకు మొగ్గు చూపాయట. ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీసులను అద్భుతంగా నిర్వహించడంతో బోర్డు దీనిని వ్యతిరేకించిందని తెలుస్తోంది. ఆటగాళ్లు బుడగ వీడిన తర్వాతే వైరస్‌ సోకినట్టు సమాచారం ఉండటంతో  ఇప్పటికీ తన నిర్ణయంపై స్థిరంగానే ఉందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.

‘ఈ ఏడాది టోర్నీ వేదికగా యూఏఈనే ఐపీఎల్‌ పాలక మండలి తొలి ప్రాధాన్యం. లీగ్‌ ఆరంభానికి వారం రోజులు ముందూ యూఏఈకి వెళ్దాదమని బీసీసీఐకి ప్రతిపాదించింది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు సైతం వెంటనే అప్రమత్తమైంది. నిర్వహణకు మొగ్గు చూపింది. అయితే బీసీసీఐ పెద్దలు ప్రతిపాదనపై సత్వర చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రతిపాదన మురిగిపోయింది. ఇంగ్లాండ్‌ సిరీసును బాగానే నిర్వహించినా ఐపీఎల్‌లో పాల్గొనే వారి సంఖ్య పెద్దది. జట్లు ఎక్కువ. బోర్డు అన్ని ఏర్పాట్లు బాగానే చేసినప్పటికీ పరిస్థితి ఇలా కావడం దురదృష్టకరం’ అని ఐపీఎల్‌ వర్గాలు అంటున్నాయి.

ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని