BCCIపై రూ.1000 కోట్లకు వ్యాజ్యం
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BCCIపై రూ.1000 కోట్లకు వ్యాజ్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీసీసీఐపై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వందనా షా అనే న్యాయవాది పిల్‌ దాఖలు చేశారు. ప్రాణవాయువు సరఫరా, వైద్య పరికరాల కోసం రూ.1000 కోట్లు విరాళం ఇవ్వాలని అందులో కోరడం గమనార్హం.

ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారిన పడటంతో ఐపీఎల్‌ తాజా సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా కొవిడ్‌ విలయ తాండవం చేస్తున్నా లీగ్‌ను నిర్వహించి నష్టం కలిగించారని వందనా షా అన్నారు. ప్రాణవాయువు కొరత తీర్చేందుకు, వైద్య పరికరాలు అందజేసేందుకు రూ.1000 కోట్లు, ఆర్జించిన లాభాన్నీ విరాళంగా ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఎవరి మాటలనూ పట్టించుకోకుండా దుందుడుకు శైలితో లీగ్‌ నిర్వహించిన బీసీసీఐ క్షమాపణలు చెప్పాలని న్యాయవాది కోరారు. ప్రస్తుతం శ్మశాన వాటికలపై భారం పెరగడంతో ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేలా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రజల సంక్షేమంపై బీసీసీఐ వైఖరేంటో తెలియజేయాలని పిటిషన్లో ఆమె ప్రశ్నించారు. తానూ క్రికెట్‌కు అభిమానినే అని, అత్యంత సున్నితం, సమస్యాత్మక పరిస్థితుల్లో నిర్వహించడమే సరికాదన్నారు. ఈ వ్యాజ్యం ఎప్పుడు విచారణకు వస్తుందో ఇంకా స్పష్టత లేదు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని