రైతుల్ని నిందించొద్దు.. చట్టాల్ని రద్దు చేయండి!
close

తాజా వార్తలు

Published : 04/02/2021 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతుల్ని నిందించొద్దు.. చట్టాల్ని రద్దు చేయండి!

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులను ద్రోహులుగా ముద్రించడం ఆపేసి.. వెంటనే నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ డిమాండ్‌ చేశారు. అన్నదాతలు జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆమె యూపీలోని రాంపూర్‌ జిల్లాకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన రైతు మరణాన్ని వృథాగా పోనివ్వం. నూతన సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం. ఇలాంటి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడమే ప్రభుత్వం చేసిన తప్పు. అలాంటి చట్టాలను వెనక్కి తీసుకోకపోగా.. వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులను దేశద్రోహులుగా.. వారి ఉద్యమాన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరించడం ఏంటి’ అని మండిపడ్డారు. 

‘దేశంలోని పేదలు, రైతుల బాధలు పట్టించుకోని నాయకులు ఉన్నా లేకున్నా ఒకటే. గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ వైఖరి ఎంతో దుర్మార్గం. ఈ ఆందోళనలు దేశంలోని రైతులే కాదు.. ప్రతి ఒక్క పౌరుడూ చేస్తున్నాడు. ఈ నల్ల చట్టాల్ని రద్దు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుంది’ అని  తెలిపారు.

ఇదీ చదవండి

రఫేల్‌ రాకతో చైనా క్యాంపులో ఆందోళన!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని