
తాజా వార్తలు
మహిళలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. వైకాపా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చిందని సీఎం జగన్ గుర్తు చేశారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, ఆసరా, కాపునేస్తం పథకాలు తెచ్చామన్నారు. మహిళల పేరుతో ఇంటిపట్టాలు ఇచ్చామన్నారు. సంపూర్ణ పోషణతోపాటు నామినేటెడ్ పోస్టు్ల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. దిశ చట్టం, కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు తెచ్చామన్నారు.
ఇవీ చదవండి
Tags :