
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 139 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,86,557కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,142 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 254 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,77,893కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,552 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,27,39,648 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఇవీ చదవండి..
పీపీఈ కిట్ ధరించి 25 కేజీల బంగారం స్వాహా!
బంగారు గనిలో 21 మంది.. 2వారాలుగా
Tags :