close

తాజా వార్తలు

Published : 28/02/2021 21:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేమ బలం ఏమోగానీ.. నొప్పి తెలిసొచ్చింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమ ఎలాంటి పిచ్చి పనులైనా చేయిస్తుందని ఉక్రెయిన్‌కు చెందిన ఓ జంటను చూస్తే తెలుస్తుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా అలెగ్జాండర్‌.. విక్టోరియా జంట తమ ప్రేమ బంధం ఎంత బలంగా ఉంటుందో నిరూపించుకోవడం కోసం ఇద్దరి చేతుల్ని గొలుసులతో కట్టేసుకున్నారు. మూడు నెలలపాటు ఇలా ఉంటామని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులు వీరిద్దరూ చాలా అన్యోన్యంగా, సంతోషంగా ఉన్నారు. కానీ, రెండు వారాలపాటు వారి చేతులు గొలుసులతో కట్టేసి ఉండటంతో చేతులకు దద్దుర్లు, మంటల మొదలయ్యాయట. విక్టోరియా చేతికి అల్సర్స్‌ వచ్చాయి. అల్సర్స్‌ నొప్పిని ఆమె భరించలేపోతుంది. అయింట్‌మెంట్‌ పెట్టినా ఫలితం లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. చాలాకాలం పాటు చర్మం.. ఇనుమును తాకి ఉండటంతో ఈ అల్సర్స్‌ వచ్చినట్లు వైద్యులు చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే చర్మంలో ఉండే కణజాలాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని, వెంటనే గొలుసు తొలగించాలని హెచ్చరించారు. దీంతో వారు తమ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని