IPL: 170 తక్కువ స్కోరే 
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL: 170 తక్కువ స్కోరే 

ఇంటర్నెట్‌డెస్క్ ‌: పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరింది చెన్నై సూపర్‌ కింగ్స్‌. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసిస్‌ ఘన ఆరంభాన్నిచ్చారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో ధోనీ సేన ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వార్నర్‌ జట్టు.. అటు బ్యాటింగ్‌లోనూ.. బౌలింగ్‌లోనూ విఫలమైంది. మనీశ్‌ పాండే, విలియమ్సన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో చెప్పుకోదగ్గ స్కోరు సాధించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా నిరాశపర్చారు. మరి ఈ మ్యాచ్‌లో ఎవరేమన్నారంటే..

170 తక్కువ స్కోరే..

‘‘బ్యాటింగ్‌ అద్భుతంగా చేశాం. అలా అని బౌలింగ్‌ బాగాలేదని కాదు. దిల్లీ లాంటి మైదానంలో బౌలర్లు మెరుగ్గానే రాణించారు. 170 తక్కువ స్కోరే అనుకున్నాం. రుతురాజ్‌, డుప్లెసిస్‌ మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పారు. గత సీజన్‌లోని సమస్యలను అధిగమిస్తున్నాం. 5-6 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండి ఇలా రాణించడం క్లిష్టమైన పనే. కానీ ఆటగాళ్లంతా ఈ ఏడాది చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు’’ - ఎంఎస్‌ ధోనీ

మా భాగస్వామ్యం బాగుంది

‘రుతురాజ్‌తో నా ఓపెనింగ్‌ భాగస్వామ్యం చక్కగా కుదురుతోంది. మంచి ఆరంభాలు వచ్చినప్పుడు ఇన్నింగ్స్‌ అంతా సౌకర్యవంతంగా ఆడొచ్చు. గత సీజన్‌ నుంచి పాఠాలు నేర్చుకుని మేం కొన్ని మార్పులు చేసుకున్నాం. మా బ్యాటింగ్‌ లైనప్‌ బాగుంది. జడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. సూపర్‌మ్యాన్‌లా క్యాచ్‌లు పడుతున్నాడు’’ - డుప్లెసిస్

పూర్తి బాధ్యత నాదే

‘‘మ్యాచ్‌ ఫలితానికి పూర్తి బాధ్యత నాదే. నేను చాలా నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాను. మరో 15 మంచి షాట్లు ఆడాల్సింది. కానీ ఆడలేకపోయా. మనీశ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. కేన్‌ గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు.  మొత్తంగా 170 పరుగులు సాధించాం. కానీ ఆ తర్వాత పవర్‌ప్లేలో వికెట్లు తీయలేకపోయాం. చివరి వరకు చాలా పోరాడాం. బ్యాటింగ్‌ పరంగా మేం ఇంకా లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది’’ - డేవిడ్‌ వార్నర్‌

 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని