ఈటల వ్యవహారంలో సీఎస్‌కు నివేదిక
close

తాజా వార్తలు

Published : 02/05/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈటల వ్యవహారంలో సీఎస్‌కు నివేదిక

హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలపై మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదిక సమర్పించారు. ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్‌ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. తూప్రాన్‌ ఆర్డీవో శ్యాం ప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో ఈటలకు చెందిన హ్యాచరీస్‌ సహా పక్కనే ఉన్న అసైన్డ్ భూములపై డిజిటల్ సర్వే నిర్వహించారు. తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, మాసాయిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్‌ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఇవాళ వెల్లడించారు. తాజాగా దర్యాప్తునకు సంబంధించిన పూర్తి నివేదికను సీఎస్‌కు అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని