అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని: ఈటల
close

తాజా వార్తలు

Published : 05/05/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని: ఈటల

హుజూరాబాద్‌: ప్రగతిభవన్‌లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. సీఎంకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి కలవడానికి మంత్రులు వెళితే అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఇంత అహంకారమా? అని ఆరోజు మంత్రి గంగుల కమలాకర్‌ తనతో వ్యాఖ్యానించారని ఈటల అన్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్‌లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

నేను సీఎం కావాలనుకోలేదు

‘‘2014 వరకే కేసీఆర్‌.. ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారు. తెలంగాణ గాంధీగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి ఇవాళ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి కుట్రపూరితంగా ఎవరూ వ్యవహరించలేదు.  ఎవరివో తప్పుడు సలహాలు, నివేదిక వల్ల నాపై కక్ష సాధిస్తున్నారు. నా వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నవారంతా నా సహచరులే. నాపై ఈరోజు మంత్రులు చేసిన వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను ముఖ్యమంత్రి కావాలనుకోలేదు. కేసీఆర్‌ తర్వాత ఆయన కుమారుడే సీఎం కావాలని అన్నాను.

ఇక అన్ని పార్టీల నేతలతో మాట్లాడతా

వ్యక్తులు ఉంటారు.. పోతారు.. కానీ ధర్మం ఎక్కడికీ పోదు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తా. ఒక మనిషికి ఒక పార్టీ, వ్యక్తితో మాట్లాడే అవకాశముండదా? 2014 కంటే ముందు కాంగ్రెస్‌ మంత్రుల దగ్గరకు వెళ్లి అభివృద్ధి పనులు తెచ్చుకోలేదా? ఈరోజు మాత్రం ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్, భాజపా వాళ్లు తెరాస మంత్రులను కలవడానికి వస్తే ఫిక్స్‌ అయిపోయిందా? అని అడుగుతున్నారు. ఇతర పార్టీల నేతలతో మాట్లాడితే తప్పా? ఇక అన్ని పార్టీల నాయకులతో మాట్లాడతా’’ అని ఈటల వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని