close

తాజా వార్తలు

Updated : 12/04/2021 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌లో స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌కు అనుమతి

దిల్లీ: భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి లభించింది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. డీజీసీఐ అనుమతి లభిస్తే, దేశంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ తర్వాత అనుమతి లభించిన మూడో వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ అవుతుంది.

రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘స్పుత్నిక్‌ వి’ టీకాపై మనదేశంలో రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ఇటీవలే ఆ సంస్థ నిర్వహించింది. ఆ పరీక్షల భద్రత, ఇమ్యునోజెనిసిటీ సమాచారాన్ని ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలికి అందజేసిన డాక్టర్‌ రెడ్డీస్‌‌.. టీకా ఉత్పత్తి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకుంది. సోమవారం ఈ డేటాను కేంద్ర నిపుణుల బృందం విశ్లేషించి, అత్యవసర వినియోగానికి సిఫారసు చేసింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని