
తాజా వార్తలు
శిల్పారామంలో సందర్శకుల జోరు
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. భారీగా తరలివచ్చిన సందర్శకులతో శిల్పారామంలో పండగ వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద అందరూ కలిసి సంతోషంగా గడిపారు. శిల్పారామంలోని ప్రకృతి అందాలు, పల్లె వాతావారణాన్ని ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దిన గ్రామీణ మ్యూజియంలో అందాలను ఆస్వాదించారు. గంగిరెద్దుల విన్యాసాలు, పిట్టదొర మాటల తూటాలు, హరిదాసుల కథలు, బుడ్డ జంగమల ఆటపాటలు, ఎద్దు బండి సరదాలు, బోటు సికారులతో ప్రజలందురూ ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు.
వర్ణరంజితంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్
రంగురంగుల గాలిపటాలతో సికింద్రాబాద్ పరేడ్ మైదానం వర్ణరంజితంగా మారింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పరేడ్ మైదానానికి చేరుకొని గాలిపటాలు ఎగరవేశారు. కొవిడ్ కారణంగా చాలా రోజులు ఇళ్లకే పరిమితమైన ప్రజలు సంక్రాంతి వేళ బయటకు వచ్చి పరేడ్ మైదానంలో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఇంటిల్లిపాది తరలివచ్చి పిల్లాపాపలతో గాలిపాటలు ఎగరవేస్తూ ఆనందించారు. గతేడాది పతంగోత్సవం, మిఠాయిల ఉత్సవాలను నిర్వహించిన ప్రభుత్వం కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేసింది. కానీ ఏ మాత్రం నిరాశ చెందని నగరవాసులు పెద్ద సంఖ్యలో మైదానానికి చేరుకొని గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందంగా గడిపారు.
ఇవీ చదవండి..