దా‘రుణ’ యాప్‌లు: మరో నలుగురి అరెస్టు
close

తాజా వార్తలు

Updated : 31/01/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దా‘రుణ’ యాప్‌లు: మరో నలుగురి అరెస్టు

హైదరాబాద్: దా‘రుణ’ యాప్‌ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన నిరంజన్, యశీ గ్యాస్టో, న్యిచక్, ఉషా అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాటర్ ఎలిఫెంట్ ఫైనాన్షియల్ లిమిటెడ్, బెడ్ వ్యాలెట్ టెక్నాలజీస్ లిమిటెడ్ పేరుతో సంస్థలు స్థాపించి రుణయాప్‌లు రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా 19 రుణ యాప్‌ల ద్వారా కోట్లలో రుణాలు ఇచ్చి, అధిక వడ్డీ వసూలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. 200 మంది టెలీకాలర్ల ద్వారా రుణగ్రహీతలను ఫోన్లలో వేధిస్తున్నట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ సంస్థల వెనక ఇద్దరు చైనీయులు ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరు చైనీయులకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఇవీ చదవండి..

చలానా గాళ్‌ఫ్రెండ్‌ది.. కార్డేమో భార్యది

‘మదనపల్లె కేసులో అనుమానాలున్నాయ్’Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని