
తాజా వార్తలు
నూనె లేకుండా వండొచ్చు..
వంటకాల్లో కాస్త ఎక్కువ నూనె వేస్తే రుచి వచ్చే మాట నిజమే! కానీ తల్లిగా ఇంటిల్లి పాదీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే! అందుకే నూనె తగ్గించినా... రుచి తగ్గకుండా ఎలా వండచ్చో చూద్దాం!
ఆవిరిపై
ప్రస్తుతం కూరగాయల సలాడ్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పచ్చిగా కాకుండా కొన్ని నిమిషాలపాటు ఆవిరిపై ఉడికించి తీసుకుంటే ఆరోగ్యాన్ని అందిస్తాయి. రుచిగానూ ఉంటాయి. అలాగే ఎక్కువ నూనెతో వండే అల్పాహారాలను ఎంపిక చేసుకోకుండా, ఆవిరిపై చేసే వాటికి ప్రాముఖ్యతనిస్తే ఇంటిల్లిపాదికీ సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
నీటితో
నూనె లేకుండా వండే వంటకాల్లో కాయగూరల్ని చిన్నమంటపై కొంచెం వేగనిచ్చి, ఆ తరువాత రెండు చెంచాల నీటిని చిమ్మి మూతపెట్టాలి. ఇందులో చెక్కతో చేసిన గరిటెలను మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే గిన్నె అడుగుభాగంలో మాడకుండా ఉంటుంది.
Tags :