close

తాజా వార్తలు

Published : 03/01/2021 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గర్భసంచి తీసేయాలా?

నా వయసు 35. నెలసరి సమయంలో అయిదు నుంచి పదిరోజుల వరకు రక్తస్రావం అవుతూనే ఉంటుంది. ప్రతి నెలా ఇదే సమస్య. వైద్యులను సంప్రదిస్తే అవసరమైతే గర్భసంచి తీసేయాలన్నారు. దీన్ని తొలగించుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయా?-  ఓ సోదరి
ధిక రక్తస్రావానికి చాలా కారణాలు ఉంటాయి.  మూడు పదుల వయసులో  ఇలా జరుగుతుందంటే సమస్య ఏమిటో కచ్చితంగా తెలుసుకోవాలి. గర్భాశయంలో, అండాశయంలో కొత్తగా కణతులు ఏమైనా పెరిగాయా... చూడాలి. దీనికోసం మీరు అల్ట్రాసౌండ్‌ పెల్విస్‌, థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. రక్తహీనత ఉందేమో తెలుసుకోవడానికి కంప్లీట్‌ బ్లెడ్‌ పిక్చర్‌ కూడా అవసరం రావొచ్చు. అనీమియా అయితే ముందుగా దాన్ని తగ్గించుకోవాలి. ఊబకాయం ఉంటే కూడా ఇలా హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం ఉంది.  పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ అధిక బరువును తగ్గించుకోవాలి.  హార్మోన్లలో తేడాల వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతోంటే ఆరు నెలలపాటు మందులు వాడాలి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ‘మెరినా’ లాంటి పరికరాన్ని గర్భాశయంలో అమరిస్తే ఫలితం ఉంటుంది.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని