close

తాజా వార్తలు

Published : 09/01/2020 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోడ అంచుపై పరుగెత్తి.. భయపెట్టించింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన ఇంటి ముందున్న ప్రహరీ ఎక్కి దూకాలంటేనే మనం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. ఇక ఆ గోడపై నడవాలంటే ససేమిరా ఒప్పుకోం. కానీ ఓ చిన్నారి ఏమాత్రం భయం లేకుండా గోడపై చకచకా అటూ ఇటూ బల్లిలా పరుగులు తీసింది. ఏ నాలుగడుగుల ఎత్తున్న ప్రహరీ మీదనో పరుగెత్తిందేమో అనుకునేరు. ఏకంగా నాలుగో అంతస్తులో ఉన్న కిటికి నుంచి బాల్కనీ మధ్యలో ఉన్న అంచుగోడపై ఆ చిన్నారి ఒళ్లుగగుర్పొడిచే సాహసం చేసింది.
స్పెయిన్‌లోని టెనిరిఫ్‌ అనే పట్టణంలో ఓ కుటుంబం అపార్టుమెంటు నాలుగో అంతస్తులో నివాసం ఉంటోంది. ఓ చిన్నారి తాము ఉండే అంతస్తులోని కిటికి నుంచి బయటికి వచ్చి గోడఅంచుపై పరుగెత్తుతూ బాల్కనీకి వైపు వెళ్లింది. అక్కడ నుంచి లోపలికి వెళదామని ప్రయత్నించింది. మళ్లీ ఎందుకో వెనక్కి తిరిగి కిటికి వైపు పరుగులు పెట్టింది. ఆ దృశ్యాన్ని సమీప భవనంలో ఉన్నవారు కెమెరాతో చిత్రీకరించారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను ఏకంగా 3.4 మిలియన్ల మంది చూడగా 25వేల మంది షాకింగ్‌ ఎమోజీలతో స్పందించారు. అయితే ఆ పాప ఎవరు, వాళ్ల తల్లిదండ్రులు ఎవరనేది తేలియరాలేదని పోలీసులు తెలిపారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.