close
Array ( ) 1

తాజా వార్తలు

అవమాన భారం.. కుటుంబం తీసుకుంది ప్రాణం

గడ్చిరోలిలో ముగ్గురి ఆత్మహత్య

బల్లార్ష: తన కుమార్తె ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయిందన్న అవమాన భారంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్చిరోలి పట్టణంలోని వివేకానందనగర్‌లో రవీంద్ర వరగంటివార్‌ కుటుంబం నివాసముంటోంది. ఆదివారం ఈయన కుమార్తె ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. ఈ విషయమై పరిసరాల్లో చర్చనీయాంశమైంది. దీన్ని అవమానంగా భావించిన రవీంద్ర వరగంటివార్‌(50), భార్య వైశాలి (43), కుమారుడు సాయిరాం(19) పట్టణ శివారు సోమానా బైపాస్‌ వద్ద ఆనందనగర్‌ పరిసరాల్లోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.