close

తాజా వార్తలు

Updated : 12/02/2020 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. మోదీజీ..రాష్ట్రానికి రండి:ఆహ్వానించిన జగన్‌

హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్రమోదీతో ఆయన నివాసంలో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రధానికి ఆయన నివేదించారు. విభజన అంశాలు, ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై సీఎం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉగాది రోజున 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని.. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం జగన్‌ ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ కేసును సీబీఐకి అప్పగించాలి:పవన్‌

 కర్నూలులో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. బాలిక అత్యాచారం, హత్య ఘటనపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని పవన్‌ కోరారు. సీబీఐ విచారణకు అప్పగించకపోతే మానవహక్కుల కమిషన్‌కు తానే ఫిర్యాదు చేస్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హఫీజ్‌ సయీద్‌కు 11ఏళ్ల జైలు

 26/11 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌ కోర్టు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించారన్న రెండు కేసుల్లో అతడిని దోషిగా తేల్చింది. ఒక్కో కేసుకు ఐదున్నరేళ్ల చొప్పున మొత్తం 11 ఏళ్లు జైలుశిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు ఒక్కో కేసులో రూ.15వేలు చొప్పున జరిమానా విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఆ తర్వాత ఏ క్షణమైనా విశాఖ నుంచే పాలన’

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జె్ట్‌ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకూ సీఎం జగన్‌ న్యాయం చేస్తున్నారని చెప్పారు.  పరిపాలన వికేంద్రీకరణకు ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ:కేటీఆర్‌

 ప్రభుత్వ విధానాల వల్ల అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అటువంటి కంపెనీల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సచివాలయం కూల్చివేతపై తొందరెందుకు?

నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ లేకుండానే కొత్త సచివాలయం నిర్మించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేతపై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. కొత్త సచివాలయం నిర్మాణంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోలేదని అదనపు ఏజీ కోర్టుకు తెలియజేశారు. తుది నిర్ణయం తీసుకోకుండానే భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి తొందరెందుకని  న్యాయస్థానం ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మళ్లీ బ్యాలెట్‌ వైపా.. ప్రసక్తే లేదు: సీఈసీ 

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (ఈవీఎంలు) ట్యాంపరింగ్‌ చేయడం వీలు కాదని, మళ్లీ బ్యాలెట్‌ వైపు వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్‌ సునీల్ అరోడా తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణకు తీసుకురావాల్సిన సంస్కరణలు, ప్రవర్తనా నిబంధనావళిపై రాజకీయ పార్టీలతో కలిసి  రానున్న రోజుల్లో చర్చించనున్నట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పనివాళ్లుగా చేరారు.. రూ.కోటిన్నర దోచేశారు!

పనివాళ్లుగా ఇళ్లలో చేరి దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా బిహార్‌ రాష్ట్రం మదుబని జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు రామాశిష్‌ ముఖియా, భాగవత్‌ ముఖియా, భోళా ముఖియాల నుంచి రూ. 1.50 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జపాన్‌ నౌకలో ఇద్దరు భారతీయులకు కొవిడ్‌

జపాన్‌లోని యొకొహమా పోర్టులో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ ఓడలో ఇద్దరు భారతీయులు ‘కొవిడ్‌-19’ (కరోనా వైరస్‌) బారిన పడ్డారు. ఓడలో ఉన్న భారతీయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఓడలో ఉన్నవారిలో మొత్తం 174 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొవిడ్‌పై ప్రాంక్‌.. వ్యక్తికి ఐదేళ్ల జైలు

చైనాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలిగొన్న కొవిడ్-19 (కరోనా వైరస్‌) నానాటికీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తనకు కొవిడ్ ఉన్నట్లు ప్రాంక్‌ చేసి తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.