close

తాజా వార్తలు

Updated : 07/03/2020 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్ష దాటిన కరోనా బాధితుల సంఖ్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బారిన పడ్డ వారి సంఖ్య లక్షకు పైగా చేరింది. మృతుల సంఖ్య 3,400 దాటింది. దీంతో లక్షల మంది జనజీవనం స్తంభించిపోయింది. ఉపాధి కరవైంది. చైనాలోని వుహాన్‌ సీఫుడ్‌ మార్కెట్లో వెలుగుచూసిన వైరస్ సరిహద్దు దాటి ఖండాంతరాలకు వ్యాపించింది. దాదాపు 90కి పైగా దేశాలను ఈ కరోనా కలవరపెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మక్కా, బెత్లహాం చర్చి వంటి ప్రముఖ దర్శనీయ స్థలాలు సైతం మూసివేతకు గురయ్యాయి. 2020 ఒలింపిక్స్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. జీ-20 దేశాల సెంట్రల్‌ బ్యాంకులన్నీ ఏకతాటిపైకి వచ్చి వైరస్‌ ప్రభావాన్ని తగ్గించే చర్యలపై సమాలోచనలు జరుపుతున్నాయి. చైనాలో శుక్రవారం కొత్తగా మరో 99 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. 28 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య డ్రాగన్‌ దేశంలో 3,070కి చేరింది. 

* దక్షిణ కొరియాలో కొత్తగా మరో 174 మంది వైరస్ బారిన పడ్డట్లు ధ్రువీకరించారు. దీంతో బాధితుల సంఖ్య 6,767కు చేరింది. కొత్తగా ఎటువంటి మరణాలు సంభవించకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. 

* అమెరికాలో కాలిఫోర్నియాలో తీరంలో నిలిపి ఉంచిన నౌకలో 21 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఈ వారాంతానికి నౌకను నాన్‌-కమర్షియల్‌ పోర్టుకు తెచ్చి ప్రయాణికుల్ని బయటకు తెస్తామన్నారు. అందులో ఉన్న 3,533 మందికి పరీక్షలు తప్పక నిర్వహిస్తామన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం వాషింగ్టన్‌లోని ‘సెంటర్ ఫర్‌ డిసీజ్ కంట్రోల్‌‌’(సీడీసీ)ను సందర్శించారు. అమెరికాలో సంభవించిన కరోనా మరణాల్లో అత్యధికం వాషింగ్టన్‌ నుంచే అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ ‘జే ఇన్‌స్లీ’ని ‘స్నేక్‌’ అని విమర్శిస్తూ వివాదానికి తెరలేపారు. వైరస్‌ను అరికట్టడంలో విఫలమయ్యారనే ఉద్దేశంతోనే ఆయన ఈ విమర్శలు గుప్పించారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం మూడు శాతం కుంగిందని ప్రపంచ పర్యాటక సంస్థ(డబ్ల్యూటీఓ) వెల్లడించింది. దీంతో అంతర్జాతీయంగా పర్యాటక రంగం 50-60 బిలియన్‌ డాలర్లు నష్టపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. 

* ఇటు భారత్‌లోనూ కరోనా బాధితుల సంఖ్య 31కి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపట్టాయి. అధికారులు మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, శాఖ కార్యదర్శులతో సమావేశమై పరిస్థితులు, సన్నద్ధతను సమీక్షించనున్నారు.

* వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వైద్య వ్యాపారుల ఎలాంటి అక్రమాలకు పాల్పడొద్దని హర్షవర్ధన్‌ అన్నారు. మందులు, మాస్కుల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దేశం       బాధితుల సంఖ్య  మరణాల సంఖ్య
చైనా   80,651 3,070
దక్షిణ కొరియా 6,593   44
ఇరాన్‌       4,747   124
ఇటలీ 4,636 197
అమెరికా 230   14
జపాన్‌  348 06
ఫ్రాన్స్‌  423   07
హాంకాంగ్‌    104 02
భారత్‌  31 00
ప్రపంచవ్యాప్తంగా     100,840 3,483

      



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.