close

తాజా వార్తలు

Published : 28/05/2020 22:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మేమే పరిష్కరించుకుంటాం: విదేశాంగ శాఖ

దిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు వివాదాన్ని చైనాతో కలిసి శాంతియుతంగా పరిష్కరించుకుంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్‌- చైనా మధ్య సరిహద్దు వివాదం విషయంలో మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చిన మరుసటి రోజే విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయడం గమనార్హం. దీంతో ట్రంప్‌ ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చినట్లైంది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.

సరిహద్దు విషయంలో భారత భద్రతా బలగాలు బాధ్యతాయుతంగా వ్యహరిస్తాయని ఈ సందర్భంగా శ్రీవాత్సవ పేర్కొన్నారు. లద్దాఖ్‌ సరిహద్ధల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించుకోవడానికి ద్వైపాక్షిక ఒప్పందాలను భారత బలగాలు అనుసరిస్తాయని చెప్పారు. సరిహద్దు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించుకోవడానికి మిలటరీ, దౌత్య స్థాయిలో భారత్‌, చైనా ఇది వరకే యంత్రాంగాలు ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. సరిహద్దు విషయంలో నేతల ఆదేశాల మేరకే తమ బలగాలు నడుచుకుంటాయని తెలిపారు. అలాగే సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలూ అనేక ఒడంబడికలపై సంతకాలు చేశాయని గుర్తు చేశారు. అలాగే దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టంచేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని