close

తాజా వార్తలు

Updated : 18/06/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాదరక్షలకూ శానిటైజర్‌!

మనలో చాలామంది తాము ధరించే పాదరక్షలు అందంగా ఉన్నాయా లేదా అని మాత్రమే చూస్తారు.. కానీ శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూడరు. ఈ వర్షాకాలం వాటి శుభ్రతను నిర్లక్ష్యం చేస్తే అనేక చర్మరోగాలు వస్తాయని అంటున్నారు వైద్యులు.

యట నుంచి వచ్చీరాగానే పాదరక్షలని తీసి గాలిచొరబడని స్టాండులో పెట్టేయొద్ధు మన పాదాల చెమట వాటిలోపల పేరుకుపోయి ఫంగస్‌ విస్తరిస్తుంది. బయట గాలికి ఆరిన తర్వాత లోపల పెట్టండి.

* మార్కెట్‌లో డిస్పోజబుల్‌ వెట్‌ వైప్స్‌ దొరుకుతున్నాయి. ఎక్కడికైనా వెళ్లి వచ్చిన తరువాత ఈ వైప్స్‌తో పాదరక్షలనులోపల, వెలుపలి వైపు శుభ్రపరిస్తే వాటిపై చేరుకున్న వ్యాధికారక క్రిములు చనిపోతాయి.

* అల్ట్రా వయొలెట్‌ షూ శానిటైజర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. దీంతో చెప్పుల్లో ఉండే ఫంగస్‌, బ్యాక్టీరియా వంటివాటిని దూరం చేసుకోవచ్ఛు అలాగే ఓజోన్‌ శానిటైజర్‌ డ్రయ్యర్‌ పరికరంతో కూడా పాదరక్షలని తేలిగ్గా శుభ్రం చేసుకోవచ్ఛు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని