close

తాజా వార్తలు

Published : 06/07/2020 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రిలయన్స్‌ మరో రికార్డ్‌

ముంబయి: దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.11.5 లక్షల కోట్ల మార్కును దాటేసింది. షేరు ధర ఈ రోజు ఉదయం 2.5 శాతం పెరిగి రూ.1,833.10 దాటింది. ఇటీవలే కంపెనీ జియో డిజిటల్‌ విభాగంలో 12వ విదేశీ పెట్టుబడి రావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఈ డీల్‌ శుక్రవారం ఫైనల్‌ అయిన విషయం తెలిసిందే. డీల్‌లో భాగంగా ఇంటెల్‌ క్యాపిటల్‌కు 0.39 శాతం వాటాను విక్రయించారు. నేటి ఉదయం 10.26 సమయంలో సంస్థ మార్కెట్ విలువ రూ.11,60,142.72 కోట్లకు చేరింది. 

ఇంటెల్‌ సంస్థకు అనుంబంధంగా ఇంటెల్‌ క్యాపిటల్‌ సంస్థ పనిచేస్తోంది. ఇంటెల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ల ఉత్పత్తిదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ డీల్‌తో జియోలో 25.09 శాతం వాటాను విక్రయించినట్లైంది. గత రెండు నెలల్లో జియో వాటాలు విక్రయించి రూ.1.17 లక్షల కోట్ల మేరకు నిధులను సమీకరించింది.

డీల్‌ తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ  మాట్లాడుతూ ‘‘ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలకు భాగస్వామిగా ఉండటంతో ఇంటెల్‌కు మంచి రికార్డు ఉంది. అందుకే ఇంటెల్‌తో కలిసి పనిచేసేందుకు మేము ఉత్సాహంగా ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానంలో భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది 130 కోట్ల మంది భారతీయు జీవన నాణ్యతను పెంచుతుంది’’ అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని