కన్న కుమార్తెలపైనే అఘాయిత్యం..!
close

తాజా వార్తలు

Published : 19/01/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్న కుమార్తెలపైనే అఘాయిత్యం..!

కొచ్చి: కేరళలోని వాలంచేరీలో దారుణం చోటుచేసుకుంది. సొంత కుమార్తెలపైనే ఓ ప్రబుద్ధుడు లైంగిక దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 47 ఏళ్ల ఓ వ్యక్తి కేరళలోని వాలంచేరిలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి 17, 15, 13, 10 మైనర్‌ వయసు గల నలుగురు కుమార్తెలు ఉన్నారు. కూలీగా పనిచేస్తున్న అతడు తాగుడుకు బానిసయ్యాడు. కన్న కుమార్తెలు అని కూడా చూడకుండా వారిపై లైంగికంగా దాడి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని చిన్న కుమార్తె (10) పాఠశాలలో ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం పంపించగా లైంగికంగా వేధింపులకు గురైనట్లు తేలింది. దీంతో వారిని మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం కోసం హాజరు పరిచారు. అనంతరం పాఠశాల అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ కీచకుడిని అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని