షేర్‌ మార్కెట్‌ కుదేలైందని బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 09/04/2020 06:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షేర్‌ మార్కెట్‌ కుదేలైందని బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

బలిజిపేట: షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా బలిజిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఆర్య జిల్లాకు చెందిన అజయ్‌బాబు(27) రెండేళ్లుగా స్థానిక బ్యాంకులో క్షేత్రస్థాయి అధికారిగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.  ‘షేర్‌ మార్కెట్‌ ఇటీవల కుదేలవడంతో సుమారు రూ.20 లక్షల వరకు నష్టపోయాను. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అంటూ తల్లికి రాసిన లేఖ ఆయన పర్సులో గుర్తించినట్లు ఎస్‌ఐ నరేష్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని