విజయనగరంలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి
close

తాజా వార్తలు

Published : 02/06/2020 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయనగరంలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి

కురుపాం గ్రామీణం (విజయనగరం): విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. ఎస్సీ మరువాడ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పారయ్య (62), పండయ్య (53) చిన్నతోలు మండగూడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు భూషణ్‌రావు (35) సోమవారం సాయంత్రం పొలం పనులు నిమిత్తం వెళ్లారు. ఈ లోపు వర్షం పడడడంతో సమీపంలో ఉన్న పాకలోకి తలదాచుకున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులు పడడంతో అక్కడికక్కడే ముగ్గురు కుప్పకూలిపోయారు. వీరితో పాటు ఉన్న పండయ్య భార్య, పాప స్పృహ తప్పి పడిపోగా కొద్దిసేపటికి మెలుకువ రావడంతో ముగ్గురినీ పాక లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ విషయం సమీపంలో ఉన్న గ్రామస్థులకు తెలియజేశారు. వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ ముగ్గురూ అప్పటికే మరణించినట్టు గుర్తించారు. చిన్న మేరంగి ఇన్‌ఛార్జ్‌ ఎస్సై శివప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం వేదనగా మారింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని