పురుగుమందు తాగుతూ సెల్ఫీ వీడియో...
close

తాజా వార్తలు

Updated : 05/06/2020 12:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పురుగుమందు తాగుతూ సెల్ఫీ వీడియో...

విజయవాడ: ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక రైల్వే కీమెన్‌గా పనిచేస్తున్న పెయ్యాల రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా తాను పడుతున్న ఇబ్బందులన్నీ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడిస్తూ పురుగుల మందు తాగాడు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు గ్రామానికి చెందిన పెయ్యాల రాజు(39) రైల్వేలో కీ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తనకు ప్రమోషన్‌ ఇవ్వకుండా కీ మెన్‌గానే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశాడు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం మాధవరం రైల్వే స్టేషన్‌ ఏరియా నుంచి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్‌ ఏరియాకు బదిలీ చేశారని తెలిపాడు. రైల్వే ట్రాక్‌ పక్కన గడ్డి తొలగించమని అధికారులు ఆదేశించారని, ఇలా తనపై గత ఏడాది కాలంగా జరుగుతున్న వేధింపులను  సెల్ఫీ వీడియోలో వివరించాడు. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఎరుపాలెం రైల్వే ట్రాక్‌ సమీపంలోనే పురుగు మందును శీతలపానీయంతో కలిపి సేవించాడు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు పురుగులమందు తాగిన విషయం చెప్పడంతో  అతన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని