జమ్ముకశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా
close

తాజా వార్తలు

Updated : 19/02/2020 11:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జమ్ముకశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో మార్చి 5 నుంచి నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల అధికారి శైలేంద్ర కుమార్‌ తెలిపారు. ఖాళీగా ఉన్న దాదాపు 13,000 పంచాయతీ స్థానాలకు మార్చి 5వ తేదీ నుంచి 20 మధ్య 8 దశల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని అక్కడి యంత్రాంగం తొలుత నిర్ణయించింది. ‘‘భద్రతా కారణాల దృష్ట్యా పంచాయతీ స్థానాలకు జరగవలసిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నాం. భద్రతా సమస్యలకు సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నాం’’ అని శైలేంద్ర కుమార్‌ అన్నారు.

మంగళవారం ఆయన అక్కడి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు.. తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతించకపోవడం, తమ నాయకులను నిర్బంధించడం వంటి వాటి గురించి ప్రధానంగా నిరసన వ్యక్తం చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్‌లోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు వారితో సమావేశం నిర్వహించాం. వారు మా ముందు కొన్ని సమస్యలు లేవనెత్తారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’’ అని శైలేంద్ర కుమార్‌ తెలిపారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి తమ నాయకులను శ్రీనగర్‌లో పర్యటించకుండా ఆంక్షలు విధించారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) ఈ సమావేశంలో పాల్గొనలేదు. ఎన్నికలు జరిపేందుకు ఇది తగిన సమయం కాదని తమ నాయకులు భావిస్తున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) నాయకులు తెలిపారు. 2018లో పంచాయతీ ఎన్నికలను అక్కడి ప్రధాన పార్టీలైన పీడీపీ, ఎన్‌సీ  బహిష్కరించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని