వరుసగా మూడోసారి విజయం దిశగా ఆప్‌
close

తాజా వార్తలు

Updated : 11/02/2020 10:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా మూడోసారి విజయం దిశగా ఆప్‌

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీలో ప్రభంజనం సృష్టిస్తోంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి మొత్తం 70 సీట్లున్న దిల్లీలో  55 స్థానాల్లో ఆప్‌, 13 స్థానాల్లో భాజపా, ఇతరులు ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. న్యూదిల్లీ నియోజకవర్గంలో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, ప్రతాప్‌గంజ్‌లో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ముందంజలో కొనసాగుతున్నారు. న్యూదిల్లీ, ఉత్తర దిల్లీలో ఆప్‌ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తోంది. షార్దా, దక్షిణ దిల్లీ, ఆగ్నేయ దిల్లీ, నైరుతి దిల్లీలో ఆప్‌ ఏకపక్షంగా దూసుకెళ్తోంది. రోహిణి నియోజకవర్గంలో భాజపా నేత విజయేంద్ర కుమార్‌ ముందంజలో ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని