పురుషులతో సమానంగా వేతనాలు!
close

తాజా వార్తలు

Published : 29/02/2020 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పురుషులతో సమానంగా వేతనాలు!

వ్యాపార రంగంలో పురుషులదే హవా. ఇలాంటి రంగంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు, సంస్థలకు నేతృత్వం వహిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు కొందరు మహిళలు. పురుషులకంటే ఎక్కువగా వేతనాలు తీసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా మేటిగా నిలుస్తున్నా కొందరు మహిళల గురించి తెలుసుకుందామా...

* కిరణ్‌ మజుందార్‌షా... బయోకాన్‌ వ్యవస్థాపకురాలు. మెల్‌బోర్న్‌లో మాల్టింగ్‌, బ్రూవింగ్‌లో విద్యనభ్యసించారు. ఆమె మహిళ కావడంతో చాలా కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. ఐర్లాండ్‌కు చెందిన బయోకాన్‌ బయోకెమికల్స్‌ అధినేత లెస్లీ అచిన్‌క్లస్‌తో కలిసి మజుందార్‌షా 1978లో ‘బయోకాన్‌ ఇండియా’ సంస్థను ప్రారంభించారు. అప్పటినుంచి ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌, పేపర్‌, ఇతర ఉత్పత్తుల కోసం ఎంజైములను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆమె 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.16 కోట్లు వేతనం అందుకున్నారు.  ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

* వినితా గుప్తా...  ఫార్మా కంపెనీ ల్యూపిన్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆమె తండ్రి దేశ్‌ బంద్‌ గుప్తా దీనిని ప్రారంభించారు. 1993లో ల్యూపిన్‌ కంపెనీలో చేరి 2013లో కంపెనీ సీఈవో అయ్యారు. అమెరికాలో వ్యాపారం విస్తరించేందుకు కృషి చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సీఈవోగా 17.3 కోట్ల వేతనం అందుకున్నారు.

* రేణూసూద్‌ కర్నాడ్‌... రేణూసూద్‌ కర్నాడ్‌ హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌. సంస్థ ప్రారంభమైన తొలినాళ్ల నుంచి అందులోనే వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సంస్థ బోర్డులో చేరారు. 2010 నుంచి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆమెకు రూ.9.5కోట్ల వేతనం చెల్లించింది. 

* శోభన రామచంద్రన్‌...  పురుషులు ఎక్కువగా ఉండే ఆటోమోటివ్‌ రంగంలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు టీవీఎస్‌ శ్రీచక్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ శోభన రామచంద్రన్‌. ఈ కంపెనీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు టైర్లను సరఫరా చేస్తోంది. శోభన ఈ సంస్థలో 1985లో ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిని అలంకరించారు. ఆమె నాయకత్వంలో సంస్థ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు టైర్లు సరఫరా చేసే కంపెనీల్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఆరోగ్య వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ద్వారా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.7.3 కోట్ల వేతనం అందుకున్నారు.

* లక్ష్మి వేణు... లక్ష్మి వేణు సుందరం క్లెటోన్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె వ్యాపారవేత్తల కుటుంబంలోనే జన్మించారు. తండ్రి వేణు శ్రీనివాసన్‌ టీవీఎస్‌ గ్రూప్‌ వ్యవహారాలు చూస్తున్నారు. తల్లి మల్లిక శ్రీనివాసన్‌ అమల్గమేషన్స్‌ గ్రూప్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016-17లో లక్ష్మి వేణు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా 6 కోట్ల వేతనం తీసుకున్నారు.


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని