వేతనాల కోతపై హైకోర్టులో విచారణ
close

తాజా వార్తలు

Published : 08/04/2020 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేతనాల కోతపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారి పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను తెలంగాణ హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. సీనియర్‌ న్యాయవాదులు సత్యంరెడ్డి, జంధ్యాల రవిశంకర్‌ రాసిన లేఖలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అమర్‌నాథ్‌ ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. దీనిపై ఈనెల 17లోపు వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మరో న్యాయవాది కరుణసాగర్‌ రాసిన లేఖను కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని న్యాయవాది ప్రస్తావించారు. ప్రజలు గుమిగూడుతున్న ప్రాంతాల్లో వైరస్‌, బ్యాక్టీరియాను నిర్మూలించే టన్నెల్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది జి.రొనాల్డ్‌ రాజు రాసిన మరో లేఖను కూడా హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. రైతు బజార్లు, ఆస్పత్రులు, మార్కెట్లలో సామాజిక దూరం పాటించడం కొంచెం కష్టంగా ఉంటుందని.. అలాంటి ప్రాంతాల్లో టన్నెల్‌ ఏర్పాటు చేయాలని.. ఒక్కో టన్నెల్‌ ధర సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని రొనాల్డ్‌ రాజు వివరించారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని