తప్పిపోయిన కొడుకుని ఇంటికి చేర్చిన లాక్‌డౌన్‌!
close

తాజా వార్తలు

Published : 10/05/2020 17:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తప్పిపోయిన కొడుకుని ఇంటికి చేర్చిన లాక్‌డౌన్‌!


ప్రతీకాత్మక చిత్రం

బర్వాణీ (మధ్యప్రదేశ్‌): లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఉపాధి దొరక్క.. తిండి లేక.. సొంతూళ్లకు వెళ్లలేక ఇక్కట్లు పడుతున్నారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం లాక్‌డౌన్‌ మంచే చేసింది. పదేళ్ల క్రితం దూరమైన తన కుటుంబ సభ్యులను దగ్గరకు చేర్చింది. ఇంతకీ లాక్‌డౌన్‌ వారిని ఎలా కలిపింది? అందుకు పోలీసు అధికారులు చేసిన ఏమిటి? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే!

మధ్యప్రదేశ్‌లోని బర్వాణీ జిల్లా. సుమారు 500 మంది వలస కూలీలు లాక్‌డౌన్‌ కారణంగా మహారాష్ట్ర నుంచి కాలినడకన షెంద్వా పట్టణానికి చేరుకున్నారు. వారి నుంచి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. మాట్లాడడం రాని, వినికిడి లోపం ఉన్న సుమారు 20 ఏళ్లు ఓ యువకుడు మాత్రం వివరాలు చెప్పలేకపోయాడు. దీంతో అక్కడే ఉన్న ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ అతడి వివరాలు కాగితం మీద రాయాలని సూచించారు. దీంతో ఆ యువకుడు ‘ఉరావే’ అని రాశాడు.

దీంతో సదరు ఇంటి పేరుగల వారు మధ్యప్రదేశ్‌  షాడోల్‌, ఆ పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఉంటారని ఆయనకు గుర్తుకు వచ్చింది. వెంటనే యువకుడి చిత్రాన్ని రెండు రాష్ట్రాల వాట్సాప్‌ గ్రూపుల్లో సర్క్యులేట్‌ చేయించారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఓ కానిస్టేబుల్‌ ఫోన్‌ చేసి సదరు యువకుడి వివరాలు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని శ్యాహిముడి అతడి గ్రామమని, 2010లోనే తప్పిపోయాడని చెప్పారు. దీంతో యువకుడి తండ్రి ఇత్వార్‌ దాస్‌ వీడియో కాల్‌లో మాట్లాడాడు. తన కుమారుడి పేరు లక్ష్మీదాస్‌ అని, చిన్నప్పుడే కొందరు కూలీలతో కలిసి వెళ్లిపోయాడని చెప్పాడు. కుమారుడికి మాట్లాడడం రాకపోవడంతో వివరాలేవీ చెప్పలేకపోయాడని తెలిపారు. దీంతో ఇత్వార్‌ దాస్‌ పోలీసుల అనుమతితో షెంద్వా పట్టణానికి చేరుకుని కుమారుడితో ఇంటికి వెళ్లాడని ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. వాళ్లను కలపడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని, తన శ్రమ వృథా కాలేదని చెప్పుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని