
తాజా వార్తలు
దూడ కొంచెం.. ధర ఘనం
పుంగనూరు జాతికి చెందిన 14 నెలల ఆవు దూడ రూ. 3 లక్షల ధర పలికింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన లంక సురేంద్ర అనే రైతు దీనిని అమ్మకానికి పెట్టగా.. హైదరాబాద్‌కు చెందిన ఒకరు రూ.3 లక్షలకు కొనుగోలు చేశారు. సురేంద్రకు మేలు జాతి ఆవుల పోషణ అంటే ఎంతో మక్కువ. పుంగనూరు, ఒంగోలు, గిర్ జాతి ఆవులను పెంచుతున్నారు. పక్కా పుంగనూరు జాతి కావడం, ఎలాంటి మచ్చ లేకపోవడం వల్లే ఇంత ధర లభించిందని ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వీటిని పెంచుకుంటే శుభం కలుగుతుందనే భావనతో కొనుగోలు చేస్తారని వెల్లడించారు.
-న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్
Tags :