లక్షణాలు దాచినా, పారిపోయినా మూడేళ్ల జైలు!
close

తాజా వార్తలు

Published : 06/05/2020 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లక్షణాలు దాచినా, పారిపోయినా మూడేళ్ల జైలు!

లఖ్‌నవూ: కరోనా వైరస్‌ లక్షణాలున్నా కొందరు దాచిపెడుతున్నారు. ఇంకొందరు కరోనా రోగులు ఆసుపత్రుల నుంచి పరారవుతున్నారు. దీంతో ఈ వైరస్‌ మరింత వ్యాప్తికి కారణమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కఠిన నిబంధనలతో  కూడిన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుతో పాటు జరిమానాలు కూడా విధిస్తామని ప్రకటించింది.

దిల్లీలో తబ్లిగీ జమాత్‌ సమ్మేళనానికి హజరైనప్పటికీ కొందరు యూపీలో తలదాచుకున్న ఉదంతాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల ఆస్పత్రి సిబ్బంది పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన ఘటనలు వెలుగుచూశాయి. ఇవేకాక ఆస్పత్రుల నుంచి, క్వారంటైన్‌ కేంద్రాల నుంచి పారిపోయిన ఘటనల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ దాచిపెడితే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు దీనికి అదనం. క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించినా, ఆస్పత్రుల నుంచి పారిపోయినా  1-3 సంవత్సరాలు జైలుతో పాటు రూ.10వేల నుంచి రూ.10లక్షల వరకు జరిమానా విధించనున్నారు. వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడినా, దురుసుగా ప్రవర్తించినా మూడేళ్ల వరకు జైలు, రూ.50వేలు నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లం‘ఘను’లపైనా చర్యలు తీసుకునేలా రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని