close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120084326 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => P_R1N61HKR8 [video_short_link] => P_R1N61HKR8 [created_by] => [created_date] => [modified_by] => 9030304 [modified_date] => 2020-07-11 11:50:30.077809 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 11/07/2020 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాక్‌ దారిలో చైనా!

భారత్‌తో ఇక పరోక్ష యుద్ధం

భారత్‌కు వ్యతిరేకంగా మిజోరంలో జరిగిన నిరసనలో ప్లకార్డు ప్రదర్శిస్తున్న

ఆ రాష్ట్ర మాజీ సీఎం లాల్‌ తన్హావ్‌లా

హింసాత్మక తిరుగుబాటు ఉద్యమాలతో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు దశాబ్దాలుగా అట్టుడికిపోతున్నాయి. ప్రస్తుతం చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ తిరుగుబాటు ఉద్యమాలు మరింత విజృంభించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ ఉత్తర సరిహద్దులో ఓవైపు పాకిస్థాన్‌, మరోవైపు చైనాను ఎదుర్కొంటోంది భారత్‌. భద్రతా పరంగా ఈ రెండు ప్రాంతాలపైనే సైన్యం దృష్టి సారించింది. అయితే భారతదేశ ఈశాన్య సరిహద్దులోనూ చైనా జోక్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈశాన్యంలో ఉన్న అనేక తిరుగుబాటు సంస్థలను ఉపయోగించుకొని ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ప్రమాదం ఉంది.

తిరుగుబాటుదారులతో జట్టు

అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంతో చైనా 1,126 కి.మీ. పొడవైన సరిహద్దు కలిగి ఉంది. ఈశాన్యంలోని చాలా మంది తిరుగుబాటుదారులు ఈ రాష్ట్రం నుంచే మయన్మార్‌లోకి ప్రవేశిస్తుంటారు. అక్కడి నుంచి చైనాలోని యున్నాన్‌ రాష్ట్రంలోకి వెళ్తూ ఉంటారు. గతంలో అసోం, మణిపుర్‌, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులు చైనాతో సంబంధాలు నెరపిన దాఖలాలూ ఉన్నాయి. వీరందరికీ చైనా ప్రభుత్వం ఇప్పటివరకు నేరుగా సహాయం చేయకపోయినా- ప్రస్తుతం ఉన్న సైనిక ఉద్రిక్త పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్ఛు తిరుగుబాటుదారులు ప్రత్యక్షంగా మద్దతు పలుకుతుండటం చైనాకు మరింతగా కలిసివచ్చే అంశం.

అసోమ్‌లో పరిస్థితి మరింత ప్రమాదకరం. సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో పరేశ్‌ బారువా నేతృత్వంలోని ఉల్ఫా-ఐ(యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోం-ఇండిపెండెంట్‌) చైనాకు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఈమేరకు గత వారం 17 నిమిషాల వీడియో ఒకటి విడుదల చేసింది. దశాబ్దాల నుంచి చైనాతో సంబంధాలు కలిగి ఉంది ఉల్ఫా. ఒకానొక సమయంలో సైనిక, లాజిస్టిక్‌ సహకారం అందించాలని యున్నాన్‌ రాష్ట్ర ప్రతినిధులను సంప్రదించింది. ఉల్ఫా అధినేత బారువా చైనాలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు పట్టణమైన రులిలో తలదాచుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు భారత్‌ మయన్మార్‌ సరిహద్దులోని అడవుల్లో ఏర్పాటు చేసుకున్న శిబిరాల్లో కొన్ని వందల సంఖ్యలో ఉల్ఫా సాయుధ దళాలు ఉన్నట్లు సమాచారం. చైనాకు దగ్గర్లోనే ఈ శిబిరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి, ఉల్ఫాకు చెందిన ఓ వర్గానికి 15 ఏళ్లుగా జరుగుతున్న చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వలేకపోయాయి. భారత ప్రభుత్వంతో శాంతి చర్చలను ఉల్ఫా వ్యతిరేకిస్తోంది. స్వతంత్ర అసోం డిమాండ్‌పై అది మొండిపట్టు పట్టింది.

ప్రపంచంలోనే రెండో పురాతనమైన తిరుగుబాటు సంస్థగా నాగాకు పేరుంది. నాగాలతో 23 సంవత్సరాలుగా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ సరైన పరిష్కారం మాత్రం లభించలేదు. సమీప భవిష్యత్తులో చర్చల్లో పురోగతి లభిస్తుందన్న ఆశ కూడా సన్నగిల్లడం వల్ల నాగాల్లో తీవ్ర నిరాశ నెలకొంది. నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం)కు చెందిన సాయుధ బలగాలు తమ ఆయుధ సామగ్రితో భారత్‌ను విడిచి వెళ్లినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మయన్మార్‌లో కొత్త శిబిరాలు ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనాతో ఇబ్బంది పడుతున్న చైనాకు సంఘీభావంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాదాపు రెండు వేల మంది నాగాలు మణిపూర్‌లోని ఉఖ్రుల్‌ ప్రాంతంలో సంగీత కచేరీ నిర్వహించారు. ఇది భారత్‌కు హెచ్చరిక లాంటిది.

ప్రమాదకర సంకేతాలు

గతేడాది మిజోరమ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చైనాకు అనుకూలంగా ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. 60 దశకంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) నాయకత్వం వహించిన హింసాత్మక తిరుగుబాటు ఉద్యమం గురించి తెలిసినవారందరికీ ఇది చాలా ప్రమాదకరమైన విషయమని అర్థమవుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్‌లోనే అత్యధిక(సుమారు 50 వరకు) తిరుగుబాటు సంస్థలున్నాయి. సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల తిరుగుబాటు దళాల్లో చేరడమే ఇక్కడి యువతకు జీవన విధానంగా మారింది. మెయిటీ వంటి శక్తిమంతమైన తిరుగుబాటు సంస్థలు కమ్యూనిస్టు భావజాలాన్నే పాటిస్తున్న నేపథ్యంలో చైనాతో పొత్తుపెట్టుకోవడం సర్వసాధారణమే. ఈ సంస్థలకు చైనా నుంచి విస్తృత సహకారం లభించింది. ఈ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీన్ని చైనా తన ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్ఛు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ప్రజలు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. జాతీయ పౌర పట్టిక విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. బలవంతంగా వీటిని అమలు చేస్తున్నారని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలు వ్యక్తం చేశారు.

ఇవన్నీ ఈశాన్యంలో చైనా పట్ల అనుకూల వైఖరి పెరిగే అవకాశం ఉందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. ఈశాన్య భారతదేశంలో సామాజిక రాజకీయ పరిస్థితులు చైనా జోక్యం చేసుకోవడానికి అత్యంత అనుకూలంగా మారుతున్నాయి. అందువల్ల ఈశాన్య రాష్ట్రాలపై శీతకన్నువేసే నిర్ణయాలను పూర్తిగా నిలిపివేయాలి. ప్రజల శ్రేయస్సు కోసం వివేకవంతమైన చర్యలు తీసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజల మనసులను గెలుచుకునే దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేయాలి.

- సంజీవ్‌ కె.బారువా



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.