close

తాజా వార్తలు

Published : 29/09/2020 07:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా నిర్ధారణకు చౌకైన, వేగవంతమైన పరీక్ష

అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు
ఉత్పత్తికి అనుమతించిన డీజీసీఐ

దిల్లీ: కొవిడ్‌ నిర్ధారణకు ప్రస్తుతం చేస్తున్న ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష కన్నా మరింత కచ్చితంగా, అంతే వేగంతో ఫలితాన్ని తెలియజేసే ‘క్రిస్పర్‌ ఫెలూదా’ పరీక్షను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని దిల్లీలోని సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ (ఐజీఐబీ), టాటా గ్రూప్‌ సంస్థలు అభివృద్ధి చేశాయి. ఈ పరీక్ష కిట్లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అనుమతినిచ్చింది.
ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే సృష్టించిన డిటెక్టివ్‌ పాత్ర ఫెలూదా పేరును ఈ పరీక్షకు పెట్టారు. దీనికి రూ.500 ఖర్చవుతుంది. గర్భధారణ పరీక్షకు ఉపయోగించే పట్టీ తరహాలో ఇది ఉంటుంది. వైరస్‌ను గుర్తిస్తే దీని రంగు మారిపోతుంది. 45 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. ఇతర రకాల కరోనా వైరస్‌లలో కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను ఇది నిర్దిష్టంగా గుర్తించగలదు. ఈ పరీక్ష ‘క్లస్టర్డ్‌ రెగ్యులర్లీ ఇంటర్‌స్పేస్డ్‌ షార్ట్‌ పాలిండ్రోమిక్‌ రిపీట్స్‌’ (క్రిస్పర్‌) పరిజ్ఞానం ఆధారంగా పనిచేస్తుంది. ఒక జన్యువు లోపల నిర్దిష్ట డీఎన్‌ఏ క్రమాలను ఇది గుర్తించగలదు. పరమాణు కత్తెరలా పనిచేసే ఒక ఎంజైమ్‌ సాయంతో ఆ జన్యువును కత్తిరించగలదు. ఈ సామర్థ్యంతో కరోనా వైరస్‌ను కూడా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అత్యంత నిర్దిష్టమైన ‘కాస్‌9 ప్రొటీన్‌’ ఆధారంగా కరోనా వైరస్‌ను గుర్తిస్తుందన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.