close

తాజా వార్తలు

Updated : 12/04/2021 07:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాపికొండల పర్యటనకు పచ్చజెండా

ఈ నెల 15 నుంచి ప్రారంభం

దేవీపట్నం, న్యూస్‌టుడే: పాపికొండల పర్యటనకు అధికారులు పచ్చజెండా ఊపారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు బోటు ప్రమాదం అనంతరం దాదాపు 18 నెలలుగా పాపికొండల విహారయాత్ర నిలిచిపోయింది. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖకు సంబంధించిన ఓ బోటుకు జలవనరులశాఖ అధికారులు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. దీంతో ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి (కంపెనీ) వద్ద నుంచి బోటు బయలుదేరనున్నట్లు ఉభయగోదావరి జిల్లాల ఏపీటీడీసీ డివిజనల్‌ మేనేజర్‌ (కాకినాడ) టి.ఎస్‌.వీరనారాయణ ‘న్యూస్‌టుడే’కి తెలిపారు. పాపికొండలు వెళ్లే పర్యాటకులకు టికెట్లను త్వరలోనే ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పారు. పోశమ్మగండి, సింగనపల్లి వద్ద కంట్రోల్‌రూమ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని