AP News: వసూళ్లలో వాటా కోసం హిజ్రాల గొడవ

తాజా వార్తలు

Updated : 30/07/2021 07:28 IST

AP News: వసూళ్లలో వాటా కోసం హిజ్రాల గొడవ

కలెక్టరేట్‌ ఎదుట హిజ్రాల నిరసన

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురంలో హిజ్రా గ్రూపుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పోలీసులు, బాధిత వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ లీడర్లకు వసూళ్లలో వాటా చెల్లించే విషయంలో మూడేళ్లుగా వివాదం సాగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడి హిజ్రా సంఘాలు హైదరాబాద్‌ నాయకులకు కాకుండా రాయలసీమ జిల్లాల గ్రూపు నాయకులకు కొంత వాటాను చెల్లిస్తున్నారు. ఈ విషయంపై మూడేళ్ల కిందట వివాదాలు చోటు చేసుకోవడంతో గ్రూపుల లీడర్లు ఘర్షణ పడ్డారు. అప్పట్లో ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు అప్పట్లో ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఇదిలావుండగా బుధవారం రాత్రి అనంతపురం జీసెస్‌ నగర్‌లోని ఒక కల్యాణ మండపంలో స్థానిక హిజ్రాలు ఉలిగమ్మ జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, రాయలసీమ, బెంగళూరు హిజ్రా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వసూళ్లలో వాటాను ఎందుకు పంపడం లేదని తెలంగాణ ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. అనంతపురానికి చెందిన శర్మాస్‌పై హైదరాబాద్‌, బెంగళూరుకు చెందిన లీడర్లు దాడి చేశారు. శర్మాస్‌ను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారని జిల్లాకు చెందిన హిజ్రాలు ఆరోపించారు. అయితే తమను జాతరకు ఆహ్వానించి కావాలని గొడవకు దిగారని హైదరాబాద్‌, బెంగళూరుకు చెందిన ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. తమ లీడర్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారని గురువారం కలెక్టరేట్‌ ఎదుట జిల్లా ప్రతినిధులు నిరసనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలేశారు. దాడి ఘటనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని