ఈ సయ్యద్‌.. సదాశివపేట సోనూసూద్‌
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 07:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ సయ్యద్‌.. సదాశివపేట సోనూసూద్‌

ఉచిత అంబులెన్స్‌ సేవలతో కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు సదాశివపేటకు చెందిన సయ్యద్‌ అంజద్‌. గత ఫిబ్రవరిలో అంబులెన్స్‌ వాహనాన్ని కొని.. ఇద్దరు సిబ్బందితో దీనిని నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలున్న వారికి ప్రాధాన్యమిస్తూ సదాశివపేట నుంచి సంగారెడ్డి, హైదరాబాద్‌లలోని ఆస్పత్రులకు ఉచితంగా తీసుకెళుతున్నారు. మరణించిన వారి మృతదేహాలనూ అంబులెన్స్‌లో ఉచితంగా తరలిస్తున్నారు. అత్యవసర చికిత్స అవసరమైన 95 మందిని ఇప్పటివరకు ఆస్పత్రులకు ఉచితంగా చేర్చినట్లు సయ్యద్‌ అంజద్‌ సంతోషంగా చెప్పారు. ఇందుకోసం నెలకు రూ.60 వేల వరకూ వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరాలు దొరక్క భోజనానికి ఇబ్బంది పడుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని.. సయ్యద్‌ కుటుంబం సదాశివపేట బస్టాండ్‌ సమీపంలో అన్నదానం ప్రారంభించింది. ఇప్పటికీ అక్కడ రోజుకు దాదాపు వంద మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు.

- ఈనాడు, సంగారెడ్డి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని