టీపొడి విషయంలో మందలింపు.. కోడలి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 07:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీపొడి విషయంలో మందలింపు.. కోడలి ఆత్మహత్య

గోల్కొండ, న్యూస్‌టుడే: టీలో టీపొడి ఎక్కువ వేసిందని అత్త మందలించడంతో మనస్తాపానికి గురైన కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను గోల్కొండ పోలీసుల సోమవారం వెల్లడించారు. గోల్కొండ రేషమ్‌బాగ్‌కు చెందిన సయ్యద్‌ హబీబ్‌ ఓ వ్యాపారి. ఈ నెల 1న ఆయన తల్లి సఫియాబేగం టీ ఇవ్వాల్సిందిగా కోడలు బీబీ(24)ను కోరారు. బీబీ టీ తయారు చేసి అత్తకు ఇవ్వగా.. అందులో టీపొడి ఎక్కువగా ఉందని అత్త కోడలిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బీబీ గదిలోకి వెళ్లి ఉరేసుకొని మృతిచెందింది. కుటుంబసభ్యులు తలుపులు తట్టినా ఆమె తెరవకపోవడంతో బద్దలు కొట్టుకుని లోనికి వెళ్లి చూడగా బీబీ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని