
తాజా వార్తలు
మధ్యాహ్నం ఒంటి గంటకు 18 శాతం పోలింగ్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 18.20శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రముఖలంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలోని యువత మాత్రం ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తిచూపడంలేదు.
ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం, 11 గంటల వరకు 8.9 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 18.20శాతం పోలింగ్ నమోదైంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50శాతం పోలింగ్ నమోదు కావడంతో ఈ సారి పోలింగ్ శాతం పెంచాలని అధికారులు ప్రయత్నించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అయినా.. నగర వాసులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు.
Tags :
జనరల్
జిల్లా వార్తలు