close
Array ( ) 1

తాజా వార్తలు

14 అడుగుల గోడ ఎక్కి తప్పించుకుంది!

14 అడుగుల గోడ ఎక్కి తప్పించుకుంది!

లఖ్‌నవూ: పదిహేనేళ్ల ఓ బాలిక 14 అడుగుల గోడను 1.16 నిమిషాల వ్యవధిలో ఎక్కి హాస్టల్‌ నుంచి తప్పించుకున్న ఘటన లఖ్‌నవూలోని మోతీనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలించి వివరాలు తెలిపారు. బస్తీ జిల్లాకు చెందిన ఆ బాలిక కొన్ని రోజుల క్రితం రైలు పట్టాల మీద కనపడడంతో ఆమెను రక్షించిన రైల్వే పోలీసులు.. చిన్నారుల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించారు. అనంతరం వారు ఆమెను వసతిగృహంలో చేర్చారు. బాలికకు అందులో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అయితే.. అక్కడ చేరిన నాలుగు రోజులకే ఆమె తప్పించుకుని పారిపోయింది. 

ఆ బాలిక హాస్టల్‌లోని మొదటి అంతస్తుపై ఉన్న సమయంలో అక్కడ ఎవరూ లేరు. దీంతో భవనం పైకప్పు ఎక్కి అక్కడి నుంచి, వసతి గృహం పక్కన ఉన్న బిల్డింగ్‌పైకి ప్రవేశించి అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంది. తొలుత మొదటి అంతస్తులో ఉన్న వాషింగ్‌ బేసిన్ ఎక్కిన ఆమె.. అనంతరం రూఫ్‌ ఎక్కడానికి నిమిషం పాటు ప్రయత్నించింది. చివరకు ఓ అంచు పైకి ఎక్కి ఆ తరువాత రూఫ్‌ ఎక్కింది. మొత్తం ‌1.16 నిమిషాల వ్యవధిలో 14 అడుగుల గోడను ఎక్కింది. అనంతరం దానిపై కొద్ది సేపు ఉండి, తమ వసతిగృహానికి పక్కన ఉన్న మేడపైకి ప్రవేశించి, అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ వసతిగృహంలో మరో 75 మంది బాలికలు కూడా ఉంటున్నారు. ఆమె పారిపోతున్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ వసతిగృహ నిర్వాహకులపై విమర్శలు వస్తున్నాయి. 

దీనిపై ఆ వసతిగృహ నిర్వాహకులు మీడియాతో మాట్లాడడానికి ఒప్పుకోలేదు. అయితే, అందులో పనిచేసే ఓ ఉద్యోగి ఈ విషయంపై మాట్లాడుతూ... ఆ బాలిక తిరిగి తాను ఉండే ప్రాంతానికి వెళ్లి పని చేసుకుని బతకాలని అనుకుంటుందని తెలిపాడు. అంతకు ముందు ఆమె బస్తీ జిల్లాలో రోడ్లపై ప్లాస్టిక్‌, ఇనుప ముక్కలు సేకరించి అమ్ముకుని డబ్బులు సంపాదించుకునేదని తెలుస్తోంది. ఆమెకు తన ఇంటికి వెళ్లాలని కూడా లేదని, చాలా సార్లు ఆమె ఇంట్లోంచి పారిపోయిందని పోలీసులు తెలిపారు. చిన్నారుల హక్కుల రక్షణ కమిషన్‌ సభ్యురాలు ప్రీతి వర్మ మరికొందరితో కలిసి ఆ వసతి గృహాన్ని పరిశీలించారు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బాలికల కదలికలపై మరింత దృష్టి పెట్టి పని చేయాలని విమర్శించారు. తప్పించుకుని పారిపోయిన ఆ బాలిక కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.