close

తాజా వార్తలు

Updated : 20/10/2020 11:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌ను వెంటాడుతున్న వరద కష్టాలు

హైదరాబాద్‌: నగర వాసులను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. మరి కొన్ని కాలనీల్లో వరద తగ్గినా బురద పేరుకుపోయింది. కాలనీల్లో ఎటు చూసిన పేరుకుపోయిన వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో రహదారులు కుంగి గుంతలు ఏర్పడుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన వర్షం అర గంటపాటు పడింది. ఇప్పటికే చిగురుటాకులా వణికిపోతున్న నగర ప్రజలను ఈ వర్షం మరింత భయాందోళనకు గురిచేసింది.

రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్‌ఎంసీ
మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈరోజు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురవడంతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు తరలించారు. మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తిచేశారు. వరద సహాయక చర్యల కోసం వివిధ రిజర్వాయర్ల వద్ద ఉన్న పర్యాటక శాఖ బోట్లను హైదరాబాద్‌ తెప్పించారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతి వద్ద దాదాపు 50 బోట్లను సిద్ధంగా ఉంచారు. వీటికి తోడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పర్యాటక శాఖకు చెందిన 5 బోట్లను, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని పంపింది. 

ఫీవర్‌ ఆసుపత్రి వద్ద కుంగిన రోడ్డు
వరుసగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని న్యూ నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి వద్ద రోడ్డు కుంగింది. వెంటనే స్పందించిన పోలీసులు రహదారికి ఇరు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

చాంద్రాయణగుట్టలో ప్రధాన రహదారిపై చెత్త..
నిన్నటి వరకు వరదల్లో మునిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడితే.. ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వరద కారణంగా ఇళ్లలో, కాలనీల్లో ఎక్కడ చూసినా బురద, చెత్త పేరుకుపోయింది. వ్యర్థాలను తొలగించేందుకు ప్రజలు నానా పాట్లు  పడుతున్నారు. పాతబస్తీలోని పలు కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను చాంద్రాయణగుట్ట నుంచి డీఆర్‌డీఎల్‌ వెళ్లే ప్రధాన రహదారిపై వేశారు. రాత్రి నుంచి ఈ ప్రాంతంలో టన్నుల కొద్దీ చెత్త వేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.