close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120072316 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => xC69m7VvadI [video_short_link] => xC69m7VvadI [created_by] => [created_date] => [modified_by] => 9028454 [modified_date] => 2020-06-05 14:24:00.52199 [display_status] => 1 [video_isdeleted] => ) [1] => stdClass Object ( [video_news_id] => 120072316 [video_srlno] => 2 [video_type] => 1 [video_link] => kZFMK8oSSWk [video_short_link] => kZFMK8oSSWk [created_by] => [created_date] => [modified_by] => 9028454 [modified_date] => 2020-06-05 14:24:00.577236 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 05/06/2020 14:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుమల శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి తితిదే మార్గదర్శకాలను విడుదల చేసింది. శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌  వై.వి.సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఈనెల 8 నుంచి తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న లడ్డూల విక్రయం ఈనెల 8 నుంచి నిలిపివేస్తున్నట్టు చెప్పారు.

> ఈనెల 8, 9న కొంత మంది గుర్తింపు పొందిన తితిదే ఉద్యోగులకు స్వామివారి దర్శనం.
> 10న స్థానిక భక్తులకు   అనుమతి
> 11 నుంచి దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుమతి. 
> రోజూ సుమారు 3వేల ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులోకి. 
> కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు తిరుమలకు రావొద్దు. 
>  ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేసుకున్న వారికి అలిపిరిలో పరీక్షలు
> 65 ఏళ్లు పైబడిన వారు, పిల్లలకు అనుమతి నిరాకరణ 
> మాస్క్‌లు తప్పనిసరి, భౌతికదూరం పాటించాలి. 
> ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి.
> ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నడకదారిలో భక్తులకు అనుమతి.
> వసతి గదుల్లో రెండో రోజు కొనసాగేందుకు అనుమతి ఉండదు.
> వసతి గదిలో ఇద్దరికి మాత్రమే అనుమతి.
> క్యూలైన్లను ప్రతి రెండు గంటలకోసారి శానిటైజ్‌ చేస్తారు.
> శ్రీవారి ఆలయంలోని ఉపాలయాల దర్శనం ఉండదు.
> వైరస్‌ ప్రబలే అవకాశం ఉన్నందున శఠారి, తీర్థం ఇవ్వరు.
> శ్రీవారి పుష్కరిణిలో స్నానాలకు భక్తులను అనుమతించరు.
> ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నా... వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతి.
> శ్రీవారి హుండీ వద్దకు వెళ్లే వారికి హెర్బల్‌ శానిటైజేషన్‌ ప్రక్రియ.
> శ్రీవారి హుండీలో కానుకలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
> తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి  నిరాకరణ
> శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొన్నాళ్ల పాటు అనుమతి ఉండదు
> 11 నుంచి ఉదయం 6.30 నుంచి 7.30 వరకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు

 




Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.