IPL 2021: భారత్‌లో ఉండదన్న దాదా
close

తాజా వార్తలు

Published : 10/05/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: భారత్‌లో ఉండదన్న దాదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఓ స్పష్టతనిచ్చారు. మిగిలిన సీజన్‌ను భారత్‌లో నిర్వహించే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. మళ్లీ జట్లన్నింటికీ ఇక్కడ 14 రోజుల క్వారంటైన్ వంటి ఏర్పాట్లు చేయడం కష్టమేనన్నారు. మిగతా బోర్డులను సంప్రదించాక ఐపీఎల్‌ మిగతా సీజన్‌ గురించి ఆలోచిస్తామని వెల్లడించారు.

సగం సీజన్‌ ముగిసిన తర్వాత ఐపీఎల్‌-21 నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముంబయి, చెన్నై వేదికలు సవ్యంగానే సాగాయి. ఎప్పుడైతే దిల్లీ, అహ్మదాబాద్‌కు వేదికలు మార్చారో బయో బుడగ బలహీన పడింది. ప్రయాణాలు, ఇతర కారణాల వల్ల ఆటగాళ్లకు వైరస్‌ సోకింది. కోల్‌కతాలో వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌, హైదరాబాద్‌లో వృద్ధిమాన్‌ సాహా, దిల్లీలో అమిత్‌ మిశ్రా, చెన్నైలో బ్యాటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లు మైక్‌ హస్సీ, లక్ష్మీపతి బాలాజీకి పాజిటివ్‌ వచ్చింది. దాంతో సీజన్‌ను వాయిదా వేయక తప్పలేదు.

‘ఐపీఎల్‌కు 14 రోజుల క్వారంటైన్‌ వంటి నిర్వహణా పరమైన ఇబ్బందులు ఉన్నాయి. అందుకే మిగతా సీజన్‌ భారత్‌లో జరగదు. క్వారంటైన్‌ను ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఇక లీగ్‌ను ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. తగిన విండో కోసం ప్రయత్నించాలి’ అని గంగూలీ అన్నారు.

ప్రస్తుతం ఐపీఎల్‌ మిగిలిన సీజన్‌కు ఆతిథ్యమిచ్చేందుకు చాలా దేశాలు, క్రికెట్‌ సంఘాలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. వార్విక్‌ షైర్‌, సర్రే, మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ), శ్రీలంక, యూఏఈ తమ వద్ద నిర్వహించాలని బీసీసీఐకి ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. అయితే బోర్డు మాత్రం వేచిచూసే ధోరణిలో ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని