
తాజా వార్తలు
ఎస్పీ బాలు పాత్రలో అమితాబ్ బచ్చన్?
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు సినిమాలో ఆణిముత్యాలు అని కొన్ని ఏరితే... అందులో మిలమిలా మెరిసిపోయే కొన్నింటిలో ‘మిథునం’ ఒకటి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్ అనే చెప్పొచ్చు. రెండే పాత్రలతో తనికెళ్ల భరణి తెరకెక్కించిన విధానం... ఎస్పీబీ, లక్ష్మీ నటన సినిమాకు ఊపిరి పోశాయి. అంతేకాదు ఈ సినిమాకు భాష ప్రధానం కాదు అని కూడా రుజువు చేశారు. అందుకేనేమో ఈ సినిమా వచ్చి ఎనిమిదేళ్లు దాటుతున్నా... ఇంకా ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.
‘మిథునం’ను బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ముంబయికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిందని భోగట్టా. అంతేకాదు ఇందులో అమితాబ్, రేఖ నటిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి గానీ, నటీనటుల నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం వెలువడలేదు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఈ కాంబినేషన్ కుదిరితే అభిమానులకు పండుగనే చెపపాలి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ జంట జోడీ కడుతుంటే.. వారిని డైరెక్ట్ చేసే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి మరి!
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
